నందమూరి బాలకృష్ణ-బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. 'అఖిల్' అరంగేట్రం చేసిన సాయేషా సైగల్‌ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. #బీబీ3 టీమ్‌తో పనిచేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సాయేషా ట్వీట్ చేసింది.
బాలకృష్ణ సరసన 'అఖిల్' బ్యూటీ - బాలకృష్ణ తాజా వార్తలు
యువనటి సాయేషా సైగల్.. బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్గా చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
బాలకృష్ణ హీరోయిన్గా 'అఖిల్' బ్యూటీ
మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్.. కరోనా ప్రభావంతో నిలిచిపోయింది. మళ్లీ ఏడు నెలల తర్వాత ఇటీవలే తిరిగి మొదలైంది. ఈ క్రమంలోనే పలువురు భామల్ని పరిశీలించి, సాయేషాను ఫైనల్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవికి థియేటర్లలో సినిమా విడుదలయ్యే అవకాశముంది.