సత్యదేవ్ కథానాయకుడిగా 'హబీబ్' పేరుతో ఓ ఎమోషనల్ ఫీచర్ చిత్రం రూపొందింది. ఓ ఇండియన్ ఆర్మీ అధికారి, కనపడకుండాపోయిన తన కొడుకు గౌతమ్‌ను వెతుక్కుంటూ అఫ్గానిస్థాన్ చేరుకోవడం.. తన కొడుకుతోపాటు బానిస బతుకులు వెళ్లదీస్తున్న ఎంతోమందికి స్వేచ్ఛనందిచడం.. వంటి భావోద్వేగపూరితమైన కథాంశంతో 'హబీబ్' రూపుదిద్దుకుంటోంది.
సత్యదేవ్‌లోని నటుడికి ఇదొక నిదర్శనం! - సత్యదేవ్ హబీబ్
కథానాయకుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో రూపొందిన ఎమోషనల్ ఫీచర్ చిత్రం 'హబీబ్'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
సత్యదేవ్‌లోని నటుడికి ఇదొక నిదర్శనం!
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సరికొత్త పాట విడుదలైంది. ఇందులో సత్యదేవ్ నటన ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. జెన్నీఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జయ ఫణికృష్ణ స్వరాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి..'గల్లీరౌడీ' రిలీజ్ డేట్.. నిఖిల్ కొత్త సినిమా అప్డేట్