తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2022, 8:32 AM IST

ETV Bharat / sitara

పల్లెటూరి కథలతో.. ప్రముఖ దర్శకుడి వెబ్​ సిరీస్​

Satish Vegesna New Web Series: ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్‌.. తొలిసారి ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు. పల్లెటూరి కథలతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు 'కథలు.. మీవి మావి' అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Satish Vegesna
వేగేశ్న సతీష్‌

Satish Vegesna New Web Series: 'శతమానం భవతి', 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలతో సినీప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వేగేశ్న సతీష్‌. ప్రస్తుతం 'కోతికొమ్మచ్చి', 'శ్రీ శ్రీ రాజావారు' సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. తొలిసారి ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నారు. పల్లెటూరి కథలతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు 'కథలు.. మీవి మావి' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ లుక్‌ను దర్శకుడు సతీష్‌ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

"కుటుంబ ప్రేక్షకులు హాయిగా చూసేలా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఈ సిరీస్‌ తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే మూడు కథలకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథలు పూర్తి చేసి.. ఓ ప్రముఖ ఓటీటీ వేదికలో విడుదల చేస్తామ"ని వెబ్‌సిరీస్‌ బృందం వెల్లడించింది.

ఇదీ చదవండి:తెరపై కుదిరితే జంట.. కనులకే పంట

ABOUT THE AUTHOR

...view details