సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. ఈరోజు(శనివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని, అభిమానుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలో ఓవర్సీస్లో తొలిరోజే మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. ఆస్ట్రేలియా 'సాహో' పేరిట ఉన్న ప్రీమియర్స్ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం.
'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'! - entertainment news
మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు'.. ఆస్ట్రేలియాలోని ప్రీమియర్ షోల్లో 'సాహో' రికార్డును అధిగమించిందని సమాచారం. మొత్తంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్‌ను తొలి రోజే అందుకుందని టాక్.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకొందీ సినిమా. యూఎస్‌లో దాదాపు 291 కేంద్రాల్లో ప్రదర్శితమై, $758k గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో 31 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం.. A$232k కలెక్షన్లు సాధించిందట. ఇది 'సాహో' వసూళ్ల కంటే అధికం.
'సరిలేరు...'లో మహేశ్ ఆర్మీ ఆధికారిగా కనిపించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.