సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కేజీఎఫ్ 2'. భారీ వసూళ్లను రాబట్టి.. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన యాక్షన్, పవర్‌ఫుల్ డ్రామా 'కేజీఎఫ్'కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో రానున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అడుగుపెట్టారు. ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న సంజూ.. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చారు. అయితే దానికి సంజయ్ నిరాకరించారని సమాచారం.
స్టంట్ల మార్పు గురించి సంజయ్ దత్ స్పందిస్తూ.. "యాక్షన్ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పని విషయంలో ఎలాంటి రాజీపడేది లేదు" అని సంజూ చెప్పారట.