ఇకపై అమ్మాయిల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసే పాత్రలు చేయనని చెప్పాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్. తనకు స్ఫూర్తినిచ్చిన హాలీవుడ్ నటులు మెల్ గిబ్సన్, డెంజల్ వాషింగ్టన్లా విభిన్న కథల్లో నటించాలని ఉందని వెల్లడించాడు.
భార్య మాన్యతతో కలిసి సంజయ్ దత్ నిర్మించిన మరాఠీ చిత్రం... 'బాబా'. మంగళవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, నందితా పట్కర్, స్ప్రూహ జోషి, అభిజిత్ ఖండ్కేకర్, చిత్తరంజన్ గిరి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ ఆర్ గుప్తా దర్శకత్వం వహించాడు.
'భావోద్వేగాలకు భాష లేదని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని మా చిత్ర నటీనటులు అందంగా చెప్పారు. అసమానతలు ఉన్నప్పటికీ ఒక కుటుంబం కలిసి ఉండటానికి ఎలా ప్రయత్నిస్తుందనేదే ఈ కథ'. --రాజ్ ఆర్ గుప్తా, దర్శకుడు
సంజయ్ కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ లో 'బాబా' సినిమా గురించి చెబుతూ.. తన భావాలను పంచుకున్నాడు. తన మెుదటి మరాఠి చిత్రాన్ని తండ్రికి అంకితం ఇస్తున్నానని తెలిపాడు. ఈ చిత్రం తండ్రి, కొడుకుల అనుబంధాన్ని తెలుపుతుందని ట్వీట్ చేశాడు.
ఇది సంగతి: 'బౌండరీ నిబంధన కంటే.. మరో సూపర్ ఓవర్ బెటర్'