బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్(Sanja dutt nagpur).. కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నాగ్‌పుర్‌లో ఫిల్మ్‌సిటీ (sanjay dutt film city) ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్‌టెక్‌లో ఖిండ్సీ ప్రాంతాన్ని శనివారం, ఆయన సందర్శించారు. ఈ ప్రాంతంలో విదర్భ ఫిల్మ్‌సిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
దీంతో ఫిల్మ్సిటీను నిర్మించేందుకే ఆ స్థలాన్ని పరిశీలించడానికి సంజయ్ దత్ వెళ్లారనే గట్టిగా వినిపిస్తోంది. సంజయ్‌తో పాటు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ కూడా అక్కడకు వెళ్లడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.