మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పానుమ్ కోశియుమ్'(bheemla nayak movie) సినిమా తెలుగులో 'భీమ్లానాయక్'గా తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రలో పవన్‌కల్యాణ్ నటిస్తుండగా.. మరో హీరోగా రానా కనిపించనున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్(trivikram bheemla nayak) స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి నిర్మాత.
'భీమ్లానాయక్'.. రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ - భీమ్లానాయక్ డేనియల్ శేఖర్
'భీమ్లానాయక్'(daniel sekhar bheema nayak) సినిమాలో హీరో రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
ఈ సినిమాలో పవన్‌కు(bheemla nayak pawan kalyan role) జోడీగా నిత్యామేనన్‌ను ఖరారు చేయగా.. రానా(daniel sekhar bheema nayak) సరసన ఎవరు నటిస్తారన్నది ఇంత వరకు స్పష్టత లేదు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ను సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలొచ్చినా.. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడీ అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఆమె తొలి తెలుగు చిత్రం అవుతుంది. ఈ సినిమాలో డేనియల్ శేఖర్‌గా(bheemla nayak rananame) రానా ఓ శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.