రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇప్పటికే అవకాశాన్ని దక్కించుకున్న తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని మరో తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం అల.. వైకుంఠపురములో కీలకపాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని సముద్రఖని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
"అద్భుత దర్శకుడు త్రివిక్రమ్‌తో పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" - సముద్రఖని, తమిళ దర్శకనటుడు