తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాక్టర్​తో సమంత లంచ్​ డేట్​.. ఫొటోలు వైరల్​ - వరలక్ష్మి

Samantha: స్టార్​ హీరోయిన్ సమంత సూపర్​గా చిల్​ అవుతున్నారు. ఇటీవలే తన స్నేహితురాల్లతో కలిసి ఓ రెస్టారెంట్​లో సందడిచేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం బాగా వైరల్​ అవుతున్నాయి.

samantha
సమంత

By

Published : Feb 7, 2022, 8:14 PM IST

Samantha: అగ్రకథానాయిక సమంత ప్రస్తుతం ఫ్రీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న ఆమె స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల తన ఆప్తమిత్రురాలు శిల్పారెడ్డితో కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లి వచ్చిన సామ్‌ ఇప్పుడు మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో లంచ్‌ డేట్‌కు వెళ్లారు.

సమంత

ఈమేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఆదివారం సమంత సందడి చేశారు. నీరజా కోన, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కలిసి వెస్ట్రన్‌ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేశారు.

వరలక్ష్మితో సామ్

దీనికి సంబంధించిన ఫొటోలను వరలక్ష్మి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. "సమంత ఎంతో అందంగా ఉంది. ఈ విధంగా పోస్ట్‌ పెట్టినందుకు సామ్‌ నాకు లంచ్‌ కొనిపెట్టింది" అని పోస్ట్‌ చేయగా.. దానిపై స్పందించిన సామ్‌.. "ఏదీ మరొక్కసారి ఆ చివరి లైన్‌ ఏంటో చెప్పు" అని సరదాగా రిప్లై ఇచ్చారు. తన వీకెండ్‌ ఎంతో సరదాగా గడిచిందని రాసుకొచ్చారు. మరోవైపు సామ్‌, వరలక్ష్మి కలిసి 'యశోద' సినిమాలో కలసి నటిస్తున్నారు.

స్నేహితురాలితో సమంత

ఇదీ చూడండి:సమంత విడాకుల పోస్ట్ 'కనిపించడం' లేదు!

ABOUT THE AUTHOR

...view details