మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ సతీమణి ఉపాసన, హీరోయిన్ సమంతల మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. వీరిద్దరూ 'యువర్ లైఫ్' అనే ఆరోగ్య కార్యాక్రమం కోసం కలిసి పనిచేస్తున్నారు. ఒకరిఒకరు గిఫ్టులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
సమంత కొడుకు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్! - సమంత, ఉపాసన
టాలీవుడ్ కథానాయిక సమంత పెంపుడు కుక్క కోసం హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ప్రత్యేక బహుమతి పంపింది. అది తనకు దక్కిన బెస్ట్ గిఫ్ట్ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా సామ్ ధన్యావాదాలు తెలిపింది.
సమంత కొడుకు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
తాజాగా నటి సమంత పెంపుడు కుక్క హాష్ కోసం ఉపాసన ప్రత్యేక బహుమతి పంపించింది. దానికి సంబంధించిన వీడియోను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ బహుమతిలో బ్రాస్‌లెట్‌పై ఓ సందేశం రాసి ఉంది. 'ప్రౌడ్ మామ్ ఆప్ హాష్', 'ప్రౌడ్ సన్ ఆఫ్ సామ్' అని దానిపై రాసి ఉంది. ఇదే తనకు దక్కిన ఉత్తమ బహుమతి అని సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి ఉపాసనకు ధన్యవాదాలు తెలిపింది.