తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో నటనకు సమంత గుడ్​బై..! - ఓ బేబీ

హైదరాబాద్​ రామానాయుడు స్టుడియోలో 'ఓ బేబీ' సక్సెస్ మీట్ జరుపుకుంది. ముఖ్య అతిథిగా హీరో రానా హాజరయ్యాడు. తనకు కొరియన్ కథలు వినిపించాలంటూ చమత్కరించాడు.

త్వరలో నటనకు సమంత గుడ్​బై..!

By

Published : Jul 7, 2019, 5:30 PM IST

హైదరాబాద్​లో 'ఓ బేబీ' సక్సెస్ మీట్

సినిమాలకు త్వరలో గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది అక్కినేని కోడలు సమంత. ఈ విషయాన్ని 'ఓ బేబీ' సక్సెస్​ మీట్​లో పరోక్షంగా ప్రకటించింది. సినిమా విజయం సాధించడంపై భావోద్వేగానికి గురైన సమంత.. సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుందంటూ దర్శకురాలు నందినిరెడ్డితో తన మనసులోని మాటను పంచుకున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా హాజరయ్యాడు. చిత్ర విజయంపై ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు కొరియన్ సినిమా కథలు వినిపించాలని 'ఓ బేబీ' చిత్ర బృందానికి చెపుతూ చమత్కరించారు.

ఇది చదవండి: ఈ సినిమాతో ఆ కోరిక తీరిందన్న హీరోయిన్ సమంత

ABOUT THE AUTHOR

...view details