నాగచైతన్యతో(chaysam divorce latest news) విడిపోయిన తర్వాత సమంత కెరీర్ విషయంలో దూకుడుగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. మరికొన్ని కథలూ వింటున్నారు(samantha upcoming movies). ఇక సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉండే ఆమె, తన జోరును కొనసాగిస్తున్నారు. ఇటీవల చార్‌దామ్ యాత్రకు వెళ్లిన ఆమె, ఆ విశేషాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో 'అమ్మ చెప్పింది' అంటూ రాసుకొచ్చారు.
"నేను శక్తిమంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్ కాదు.. కానీ నాకు నేను పర్‌ఫెక్ట్.. నేను ఎప్పటికీ వెనకడుగు వేయను.. నేను ప్రేమ, దయ కలదాన్ని.. నేను దృఢ నిశ్చయం కలదాన్ని.. నేను తీవ్రమైనదాన్ని.. నేను మనిషిని.. నేను యోధురాలిని.." అని అమ్మచెప్పింది అంటూ సమంత పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.