తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌'.. ట్రోల్‌పై స్పందించిన సమంత - సమంత వార్తలు తాజా

Pushpa Item Song: సెకండ్​ హ్యాండ్​ ఐటెమ్​ అంటూ ఓ నెటిజన్​ చేసిన కామెంట్​పై ప్రముఖ నటి సమంత స్పందించారు. అసలు ఏం జరిగిందంటే?

Samantha Reply to Critics
సమంత

By

Published : Dec 22, 2021, 10:00 AM IST

Updated : Dec 22, 2021, 10:28 AM IST

Pushpa Item Song: 'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌' అంటూ ట్రోల్‌ చేసిన ఓ నెటిజన్‌కు ప్రముఖ నటి సమంత తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా' అని సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలో సమంత ఓ ప్రత్యేక గీతంలో కనిపించి అలరించారు. యూట్యూబ్‌లో ఈ పాట సృష్టించిన రికార్డుని వివరిస్తూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను మరో నెటిజన్‌ రీట్వీట్‌ చేస్తూ.. 'సమంత సెకండ్‌ హ్యాండ్‌ ఐటమ్‌. జెంటిల్‌మ్యాన్‌ నుంచి రూ.50 కోట్లు తీసుకుంది' అని రాసుకొచ్చాడు.

ఆ నెటిజన్‌ ట్వీట్‌కు సమంత పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలిచారు. 'నువ్వు ఎందుకూ పనికిరాని ఫస్ట్‌ హ్యాండ్‌ ఐటమ్‌' అంటూ నటుడు బ్రహ్మాజీ సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు.

'అంత తేలిక కాదు'

పదకొండేళ్ల సినీ కెరీర్‌లో సమంత ఐటమ్‌ సాంగ్‌లో కనిపించింది లేదు. తొలిసారి 'పుష్ప'లో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' అంటూ అల్లు అర్జున్‌ సరసన ఆడిపాడింది. తాజాగా ఈ పాట 100 మిలియన్‌ వ్యూస్‌(అన్ని భాషల్లో కలిపి) మార్క్‌ను చేరుకుంది. ఈ సందర్భంగా సమంత హర్షం వ్యక్తం చేసింది.

"నా కెరీర్‌లో నేను మంచి, చెడు, ఫన్నీ, సీరియస్‌ పాత్రలు పోషించా. అలాగే 'సామ్‌ జామ్‌' చాట్‌ షోకి హోస్ట్‌గానూ చేశా. నేను చేసే ప్రతి పనికి పూర్తిగా కష్టపడతా. కానీ, సెక్సీగా కనిపించడమంటే అంత తేలిక కాదు. దాని కోసం మరో లెవల్‌లో ఎంతో కష్టపడాలి. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాటకు మీరు చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

ఇదీ చూడండి :'పుష్ప' క్రెడిట్ మొత్తం ఆయనదే: అల్లు అర్జున్​

Last Updated : Dec 22, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details