తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాట్​ టాపిక్​గా సమంత పింక్​ డ్రెస్ - samantha akkineni

దక్షిణాది స్టార్​ హీరోయిన్​ సమంత తన ఫ్యాషన్‌ డ్రెస్​తో నెటిజన్ల మనసు దోచింది. తన మామయ్య నాగార్జున పుట్టినరోజు వేడుకలో ఆమె ధరించిన బార్బీ పింక్‌ డ్రెస్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ స్పెయిన్​ విహార యాత్రలో ఉంది.

హాట్​ టాపిక్​గా సమంత పింక్​ డ్రెస్

By

Published : Aug 31, 2019, 9:43 AM IST

Updated : Sep 28, 2019, 10:59 PM IST

హీరో నాగార్జున గురువారం తన 60వ పుట్టిన రోజు వేడుకల్ని స్పెయిన్​లోని ఐబిజాలో జరుపుకున్నాడు. అక్కడ జరిగిన బర్త్​డే పార్టీలో సమంత ప్రత్యేకమైన దుస్తుల్లో మెరిసింది. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ పింక్​ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించింది. ఆ లుక్‌లో ఉన్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది సామ్​. వీటన్నింటి ధర రూ.2 లక్షలని సమాచారం.

పింక్​ దుస్తుల్లో సమంత, అక్కినేని ఫ్యామిలీ

సామ్‌ ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో హిట్‌ అందుకుంది. కొరియన్‌ సినిమా 'మిస్‌గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా.. దర్శకురాలు నందినిరెడ్డి దీన్ని తెరకెక్కించింది. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ '96' సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్‌ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నచించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి...అందాల ఎర్ర నెమలి నిచ్చెనెక్కింది..!

Last Updated : Sep 28, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details