నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'లవ్‌స్టోరీ'. సాయిపల్లవి కథానాయిక. ఈ సినిమాలోని 'ఓ పిల్ల' అనే పాట లిరికల్ వీడియోను మార్చి 11న సాయంత్రం 4.05కు విడుదల చేయనుంది చిత్రబృందం. ఇప్పటికే సాంగ్ ప్రోమోను నెట్టింట ప్రేక్షకుల ముందుంచింది.
సామ్‌కు ఆ పాటంటే ఇష్టం.. మరి చైతన్యకు? - samantha favourate song
ప్రముఖ సినీనటి సమంత తనకు ఇష్టమైన పాటేంటో చెప్పేసింది. 'ఏ మాయ చేసావె' చిత్రంలో 'ఈ హృదయం' పాటంటే ఎంతో ఇష్టమట. మరి సామ్ భర్త నాగ చైతన్యకు ఏ గీతం ఇష్టమో తెలుసా?
సామ్‌కు ఆ పాటంటే ఇష్టం.. మరి చైతన్యకు?
ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ఓ ట్వీట్ చేశాడు. మీకు ఇష్టమైన పాట ఏంటి? అని నెటిజన్లను ప్రశ్నించాడు. తనకిష్టమైన పాట 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలోని 'వెళ్లిపోమాకే' అని.. మరి మీకు ఇష్టమైన పాటేంటో చెప్పాలని అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సమంత 'ఏ మాయ చేసావె' మూవీలో 'ఈ హృదయం కరిగించి వెళ్లకే' తనకెంతో ఇష్టమైన గీతమని ట్వీట్ చేసింది. అలా నెటిజెన్లు ఒక్కొక్కరు చైతన్యకు రిప్లై ఇచ్చారు. తమకిష్టమైన పాటలు తెలిపిన వారికి ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.