Samantha news: తాను 2012లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి కుంగుబాటుకు లోనయ్యానని అగ్రకథానాయిక సమంత అన్నారు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ బాధాకరమైన రోజుల్లో తనకు అండగా నిలిచిన ఓ స్పెషల్ పర్సన్‌ని సమంత అందరికీ పరిచయం చేశారు. తన జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకునే ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం సామ్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇంతకీ సమంత జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని సొంతం చేసుకున్న ఆ వ్యక్తి ఎవరంటే దర్శకురాలు నందిని రెడ్డి.
'కుంగుబాటులో ఉన్నప్పుడు నువ్వు నాలో స్ఫూర్తి నింపావు' - tollywood news
Samantha Ruth Prabhu: సమంత తన ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు తనలో స్ఫూర్తి నింపిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
'హ్యాపీ బర్త్‌డే నందిని రెడ్డి. నువ్వు నాలో ఎంతో స్ఫూర్తి నింపావు. 2012లో.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తీవ్ర కుంగుబాటుకు లోనయ్యాను. మళ్లీ తిరిగి వర్క్‌లోకి అడుగుపెట్టాలంటే ఏదో తెలియని బాధ. అలాంటి తరుణంలో రోజూ నాతో సమయం గడిపేందుకు నువ్వు నా వద్దకు వచ్చేదానివి. బిజీ షెడ్యూల్స్‌ని పక్కన పెట్టి, నా కోసం సమయం కేటాయించి, నాలో ఆత్మవిశ్వాసం నింపేలా దగ్గరుండి టెస్ట్ షూట్ చేయించావు. ఆ తర్వాత రోజు నుంచే నేను ధైర్యంగా సెట్‌లోకి అడుగుపెట్టగలిగాను. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవిత ప్రయాణంలోని ప్రతి అడుగులో నువ్వు నాకెంత అండగా నిలబడ్డావో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే' అని సమంత పోస్ట్ పెట్టారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సామ్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘జబర్దస్త్’, మరొకటి ‘ఓ బేబీ’. 2013లో విడుదలైన ‘జబర్దస్త్’ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది.
ఇదీ చదవండి:Prabhas: 'బాహుబలి పార్ట్ 3 ఉండొచ్చు.. వాళ్లు వదిలిపెట్టరు'