వారాంతంలో రైతులతో కలిసి వ్యవసాయం చేయడం సరికొత్త ఆలోచన అని, తానూ ఒకసారి ప్రయత్నించి చూస్తానని అంటోంది సమంత. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. ఆ విశేషాలేంటో సామ్ మాటల్లోనే.
ఇది న్యూట్రిషిన్ వీక్. మీరు చేస్తున్న పట్టణ వ్యవసాయం గురించి చెప్పండి!
సమంత:ప్రస్తుతం పట్టణాల్లో మొక్కలు పెంచడం చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని మనమే పండించుకోవాలి. అప్పుడే కొంతైనా సమస్యలు తీరతాయి.
'ఏకమ్' ఏర్పాటు చేయడానికి మీకు స్ఫూర్తి ఏంటి?
సమంత:భవిష్యత్ తరాల కోసం దీన్ని ఏర్పాటు చేశాం. చదువు అనేది కేవలం పట్టా కోసం మాత్రమే కాదు. చిన్న వయసులోనే పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావాలి. అన్ని విషయాలపై అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం.
మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి పాటించే ఆహాయ నియమాలు ఏవి?
సమంత:నా డైట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మాంసాహారం, పాల ఉత్పత్తులు తీసుకోను. కేవలం కూరగాయలు, అన్నం మాత్రమే తింటా.
మీ జీవితంలో ఏ విషయంలో ఎక్కువగా కృతజ్ఞతా భావంతో ఉన్నారు?
సమంత: ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా.
మీ జీవితంలో మెరుగు పరుచుకున్న మూడు అలవాట్లు ఏంటి?