"తెరపై ఎన్నో పాత్రల్లో కనిపిస్తుంటాం. వాటిని చూసి ప్రపంచంలో అన్ని విషయాలు మాకు తెలుసనుకుంటే పొరపాటు. సినిమా వేరు, జీవితం వేరు. సగటు మనిషిగా నాకూ కొన్ని పరిమితులు ఉంటాయి" అని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి ఈమె. ప్రస్తుతం తెలుగులో 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది.
అలా చూస్తే నేను బాగా నచ్చేస్తా: సమంత - సమంత శాకుంతలం
తనను ఎదుటివారు నటిగా చూస్తే, తన పనితీరు వాళ్లకు బాగా నచ్చుతుందని అభిప్రాయపడింది కథానాయిక సమంత. ప్రస్తుతం ఈమె 'శాకుంతలం' సినిమాతో బిజీగా ఉంది.
అలా చూస్తే నేను బాగా నచ్చేస్తా: సమంత
నేనూ మనిషినే, అందరిలా తప్పులు చేస్తుంటానని చెప్పుకొచ్చింది సమంత. "నేను నటిని. ఎదుటి వ్యక్తి ఆ కోణంలోనే నన్ను చూడాలనుకుంటా. అప్పుడు నా పనితీరు వాళ్లకు మరింత బాగా నచ్చుతుందనేది నా మనసులో మాట" అని సెలవిచ్చింది సమంత.
ఇది చదవండి:మహిళా ఆటో డ్రైవర్‌కు కారు కొనిచ్చిన సమంత