తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామజవరగమన'కు టీచర్​ పేరడి.. నెట్టింట వైరల్ - teacher peradi song

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  'అల వైకుంఠపురములో'. ఈ  సినిమాలోని 'సామజవరగమన' పాట తెగ వైరల్​ అయిపోయింది. అయితే ఇదే పాటను పేరడి చేసి విద్యార్థులను భవిష్యత్​పై దృష్టిపెట్టాలని చెబుతున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

Samajavaragamana
టీచర్

By

Published : Jan 12, 2020, 12:36 PM IST

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' పాట విడుదలైప్పటి నుంచి యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తోంది. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ పాటకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యారు. సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దూసుకెళ్తున్న ఈ పాటను ఓ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో పేరడీ చేసి ఆకట్టుకున్నారు.

మామూలుగా చెబితే విద్యార్థులు వినకపోవచ్చు అనుకున్నారేమో.. అందుకనే ఆయన 'సామజవరగమన' పాట ట్యూన్‌లో "నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు.. సమయమంతా వృథా చేస్తే ఉండదురా ఫ్యూచరూ.. నీ మనసు గాలి ఊయ్యాలలూగుతూ ఉంటే చెడిపోతావ్‌.. నీ ధ్యాసను చదువులో పెడితే మంచోడివి అవుతావ్‌.." అని పాటలా పాడి వినిపించారు.

విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా భవిష్యత్తుపై దృష్టిపెట్టాలని విద్యార్థులకు ఈ పాట రూపంలో బోధించిన తీరుకు నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చూడండి.. రివ్యూ: గ్యాప్ వచ్చినా.. కేక పుట్టించాడు!

ABOUT THE AUTHOR

...view details