స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలోను మంచి క్రేజ్ ఉంది. బన్నీ నటించిన సినిమాలన్నీ దాదాపు కేరళలో విడుదలై మంచి హిట్లందుకున్నాయి. తాజాగా బన్నీ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రాన్ని అక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. తాజాగా 'సామజవరగమన' మలయాళ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సామజవరగమన.. మలయాళ సాంగ్ ఇదిగో - samajavaragamana song
'అల వైకుంఠపురములో' చిత్రాన్ని మలయాళంలో 'అంగు వైకుంఠపురతు' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా అక్కడి ప్రేక్షకుల కోసం సామజవరగన మలయాళ వెర్షన్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
బన్నీ
మలయాళంలో 'అంగు వైకుంఠపురతు' అనే టైటిల్‌తో విడుదలవనుందీ చిత్రం. ఇప్పటికే తెలుగులో విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కేరళ ప్రేక్షకులకూ ఆ సాంగ్స్‌ను పరిచయం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. టబు ఓ కీలక పాత్ర చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. నిధి అగర్వాల్ అంత పారితోషికం తీసుకోబోతుందా..!