తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐసోలేషన్​లో బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్ - సల్మాన్ ఖాన్ వార్తలు

వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరు సభ్యులకు కరోనా రావడం వల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అగ్రకథానాయకుడు సల్మాన్​ఖాన్. ప్రస్తుతం ఈయన 'రాధే' సినిమాలో నటిస్తున్నారు.

Salman Khan isolates himself after his staff members test positive for COVID-19
హీరో సల్మాన్​ఖాన్

By

Published : Nov 19, 2020, 10:51 AM IST

తన కారు డ్రైవర్‌తోపాటు వ్యక్తిగత సిబ్బందిలోని ఇద్దరు సభ్యులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం వల్ల బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల సదరు సిబ్బందిని చికిత్స నిమిత్తం ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు.

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌ ప్రారంభం కావడం వల్ల సల్మాన్‌ 'రాధే' చిత్రీకరణలో ఇటీవలే పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. మరోవైపు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సల్మాన్‌ పలు సందర్భాల్లో వీడియోలు కూడా షేర్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details