కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్.. శనివారం(ఫిబ్రవరి 6) కోర్టుకు నేరుగా హాజరు కాకపోయినా అభ్యంతరం లేదని జోధ్‌పుర్ న్యాయస్థానం చెప్పింది. దీంతో వర్చువల్‌గా కోర్టు ముందుకు రానున్నారు సల్మాన్.
కరోనా కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు.. ఈ ఏడాది జనవరి 16న మళ్లీ హియరింగ్‌కు వచ్చింది. ఆ రోజు సల్మాన్ కోర్టుకు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలోనే రాలేకపోతున్నానంటూ న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
అసలు ఈ కేసు ఏంటి?