తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 5:58 PM IST

ETV Bharat / sitara

రికార్డు థియేటర్లలో సల్మాన్ 'దబాంగ్ 3'

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'దబాంగ్ 3'. ఈ సినిమా డిసెంబర్ 20న రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదలవనుందని సమాచారం.

సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలతో హల్‌చల్‌ చేశాడు. మరోసారి చుల్‌బుల్‌ పాండేగా 'దబాంగ్‌ 3' చిత్రంతో అలరించనున్నాడు. ఈ సినిమా ఐదువేల నాలుగువందల తెరలపై దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 20న విడుదల కానుందని సమాచారం. గతేడాదిఆమిర్‌ఖాన్‌ నటించిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రం సుమారు ఐదువేల తెరలపై విడుదలైంది. ఆ తర్వాత ఇంత భారీగా 2019లో బాలీవుడ్‌ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కావడం 'దబాంగ్‌ 3'కే దక్కుతుందని అనుకుంటున్నారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దక్షిణాది నటుడు కిచ్చా సుదీప్‌ ప్రతినాయకుడు బాలీ సింగ్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇక కథానాయికగా సోనాక్షి సిన్హా కనిపించనుండగా, నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సాయి.. సల్మాన్‌ మాజీ ప్రియురాలు ఖుషిగా నటిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ ఫిలిమ్స్, అర్బాజ్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సాజిద్‌ - వాజిద్‌లు సంగీతం అందిస్తున్నారు.

ఇవీ చూడండి.. మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!

ABOUT THE AUTHOR

...view details