కరోనా ప్రభావం సినిమా పరిశ్రమపై ఇంకా తగ్గలేదు. ఫస్ట్‌వేవ్‌లోనే తీవ్ర నష్టం చవిచూసిన చిత్రసీమకు సెకండ్ వేవ్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది. లాక్‌డౌన్ విధించడం వల్ల సినిమా చిత్రీకరణలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. దీంతో సినిమాను నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే’ ముందుకు వచ్చింది. కర్ణాటకలోని మాండ్యలో రూ.2కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 పడకలు అందుబాటులోకి తెచ్చింది. అత్యవసరం ఉన్న వారికి ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ అందించనున్నారు.
సినీ కార్మికులకు అండగా ప్రభాస్ 'సలార్' నిర్మాతలు
లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే' ముందుకు వచ్చింది. కర్ణాటకలోని మాండ్యలో రూ.2కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 పడకలు అందుబాటులోకి తెచ్చింది. అత్యవసరం ఉన్న వారికి ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ అందించనున్నారు.
సలార్
అలాగే, హోంబలే నిర్మిస్తున్న 'సలార్' చిత్రబృందంలో 350 మందికి చెరో రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలకు చెందిన 3,200 మందికి రూ.35లక్షలు విరాళంగా ఇచ్చింది. కరోనా ఫస్ట్‌వేవ్‌లోనూ ఈ నిర్మాణ సంస్థ కన్నడ చిత్రసీమకు చెందిన ఎంతోమంది కార్మికులను ఆదుకుంది. రెండు నెలల పాటు వాళ్లకు నిత్యావసర సరుకులు అందజేసింది. అదే కార్యక్రమాన్ని రెండో సెకండ్ వేవ్‌లోనూ కొనసాగిస్తోంది.