'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో గతేడాది హిట్లు కొట్టిన మెగాహీరో సాయితేజ్... ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. హైదరాబాద్‌లో నేడు(గురువారం) లాంఛనంగా ప్రారంభమైంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టాడు. ఈ కార్యక్రమానికి బీవీఎస్ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి వచ్చారు.
సాయితేజ్ కొత్త సినిమాకు పవర్‌స్టార్ క్లాప్ - movie news
కథానాయకుడు సాయితేజ్ కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
సాయితేజ్‌తో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్
ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. గతంలో 'చిత్రలహరి'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ప్రస్థానం' ఫేమ్ దేవాకట్టా దర్శకుడు. భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి: