తమ అందం, అభినయాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు కథానాయికలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లూ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే అగ్ర నాయికలు సమంత, తమన్నా తదితరులంతా డిజిటల్ తెరలపై సందడి చేసేందుకు రంగంలోకి దిగిపోగా.. ఇప్పుడు సాయిపల్లవి ఈ జాబితాలో చేరింది.
వెబ్‌సిరీస్‌తో 'ఫిదా' చేయబోతున్న సాయి పల్లవి - సాయి పల్లవి వార్తలు
ఇప్పటికే అగ్రనాయికలు సమంత, తమన్నా తదితరులంతా వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ జాబితాలో సాయి పల్లవి చేరింది.
వెబ్‌సిరీస్‌తో 'ఫిదా' చేయబోతున్న సాయి పల్లవి
త్వరలోనే సాయి పల్లవి ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. పరువు హత్యల నేపథ్యంతో సాగే కథతో ఇది రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.