తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహిళా షూటర్స్ సినిమా షూటింగ్ పూర్తి - తాప్సీ పన్ను

భారతదేశంలోనే అత్యంత వృద్ధ మహిళా షూటర్ల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'సాంద్ కీ ఆంఖ్'. తాజాగా షూటింగ్ పూర్తయింది. తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మహిళా షూటర్స్ సినిమా షూటింగ్ పూర్తి

By

Published : May 3, 2019, 7:05 PM IST

ముద్దుగుమ్మలు తాప్సీ, భూమి ఫెడ్నేకర్.. 60 ఏళ్ల మహిళా షూటర్స్​ పాత్రల్లో నటిస్తున్న సినిమా 'సాంద్ కీ ఆంఖ్'. ఉత్తర్​ప్రదేశ్​లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు హీరోయిన్లు.

ఇన్​స్టాలో భూమి పంచుకున్న ఫొటో

అత్యంత వృద్ధ మహిళా షూటర్లు చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాశ్ జా, వినీత్ కుమార్ నటిస్తున్నారు. తుషార్ హిరానందానీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details