తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామీ సామీ' వీడియో సాంగ్.. 'మేజర్' మెలోడీ పాట - nidhi agarwal hero movie

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'పుష్ప', 'మేజర్​' సాంగ్స్​తో పాటు కిరణ్​ అబ్బవరం కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్

By

Published : Jan 7, 2022, 2:10 PM IST

Pushpa songs: అల్లుఅర్జున్ 'పుష్ప'.. శుక్రవారం సాయంత్రం 8 గంటల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే 'సామీ సామీ' పూర్తి వీడియో సాంగ్​ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక.. తనదైన స్టెప్పులతో అలరించింది.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

అడివి శేష్ 'మేజర్' సినిమాలోని 'హృదయమా' అంటూ సాగే లిరికల్ గీతాన్ని హీరో మహేశ్​బాబు విడుదల చేశారు. ఈ చిత్రం 26/11 ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటించింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్​తో కలిసి మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న పాన్ ఇండియా వైడ్​ థియేటర్లలోకి రానుందీ సినిమా.

యువ కథానాయకుడు కిరణ్​ అబ్బవరం హీరోగా కొత్త సినిమా లాంచ్ అయింది. జీఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా లాంచ్

ఈ సినిమాలో హీరోయిన్​గా కశ్మిరా నటిస్తుంది. మురళి కిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details