తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డార్లింగ్​ ప్రభాస్​ 'సాహో' విడుదల తేదీ ఇదే.. - saaho-released-date-finalized-by-makers

ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'సాహో'. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

సాహో

By

Published : Jul 19, 2019, 11:38 AM IST

'బాహుబలి' లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా 'సాహో.' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీపై సందిగ్ధం ఏర్పడింది. ఆగస్టు 15న విడుదలవ్వాల్సిన చిత్రం... కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఎట్టకేలకు సాహో విడుదలపై ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర నిర్మాతలు విడుదల తేదీ ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. 'సాహో'ను ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా ఔట్​పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చూడండి.. 'ధడక్'​ జోడీ మరోసారి రాబోతోందా..?

ABOUT THE AUTHOR

...view details