తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహోలో ఒక్క ఛేజ్​ సీన్​ కోసం 90 కోట్లు..! - prabhas

'సాహో'లోని బైక్​ ఛేజ్ సన్నివేశానికి ఏకంగా 90 కోట్లు ఖర్చు చేసిందంట చిత్రబృందం. ఈ సీన్ సినిమాకే హైలెట్​గా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

ప్రభాస్

By

Published : Jun 15, 2019, 7:40 AM IST

తాజాగా విడుదలైన 'సాహో' టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు వీక్షణలతో దూసుకెళ్తోంది. విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ దక్కించుకుంది. టీజర్‌లోని ఓ సన్నివేశం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఇందులో అన్ని సీన్ల కన్నా ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించిన సన్నివేశం ఒకటుంది.

ప్రభాస్‌ బైక్‌పై దూసుకెళ్తుంటే ఓ వ్యాన్‌.. దాని వెనుక ఓ ట్రక్‌ దూసుకొచ్చి అతనిపై పడబోతున్న సీన్‌ చూశారా?. ప్రస్తుతం ఈ షాట్‌ గురించి సినీ ప్రియులంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 'సాహో' టీమ్‌ దుబాయ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ యాక్షన్‌ సీన్‌ వార్తల్లో నానుతూనే ఉంది. మనకు టీజర్‌లో రెండు, మూడు సెకన్లు మాత్రమే కనిపించిన ఈ ఛేజ్‌ సీన్‌.. సినిమాలో దాదాపు పావుగంట నిడివితో ఉండబోతుందట. ఈ సన్నివేశం దుబాయ్‌లోని ఓ భారీ ఫ్లై ఓవర్‌పై చిత్రీకరించారు. దాదాపు రూ.90 కోట్లు ఖర్చు చేసి ఈ యాక్షన్​ సీన్​ను రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ యాక్షన్ ఘట్టం కోసం హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ కెన్నీ బేట్స్‌తో వందలాది మంది నిపుణులు కొన్ని నెలల పాటు కష్టపడ్డారట. వెండితెరపై ఈ యాక్షన్‌ సీన్‌ చూస్తున్నప్పుడు వారి కష్టమెలాంటిదో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందట. విజువల్‌ ఫీస్ట్​గా ఉండబోయే ఇలాంటి సన్నివేశాలు సినిమా మొత్తంలో చాలానే ఉన్నాయని సమాచారం.

భారతీయ వెండితెరపై మునుపెన్నడూ చూడని రీతిలో యాక్షన్ సన్నివేశాలు కనువిందు చేయనున్నాయట. మరి కనుల విందు ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలంటే మాత్రం ఆగస్టు 15 వరకు వేచి చూడక తప్పదు. యువ దర్శకుడు సుజిత్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇవీ చూడండి.. 'జిందాబాద్.. జిందాబాద్​ ఎర్రాని పెదవులకీ'

ABOUT THE AUTHOR

...view details