తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క మూవీతోనే వందల కోట్ల ఆఫర్- 'సాహో సుజీత్' కథ ఇది! - saaho

"సాహో' ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్ నుంచి ఇంత భారీ బడ్జెట్ సినిమా రావడం టాక్ ఆఫ్ ది నేషన్ అవుతోంది. బాహుబలి ప్రభాస్ గురించే కాదు.. ఈ సినిమా తీసిన ఓ కుర్ర డైరక్టర్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన సుజీత్ అనే కుర్రాడికి యంగ్ రెబల్ స్టార్ అంత పెద్ద అవకాశం ఎలా ఇచ్చాడు.. !?అంతగా అనుభవం లేని సుజీత్ 350కోట్ల సినిమాని ఎలా తీశాడు. అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.చిన్న షార్ట్ ఫిల్మ్​లు తీస్తూ ఉన్న ఆ కుర్రాడు... ఐదేళ్లు తిరిగే సరికి పాన్ ఇండియా మూవీని తెరకెక్కించడం చూస్తే.. "సాహో సుజీత్ " అనకుండా ఉండలేం.. ! సుజీత్ రీల్ హిస్టరీ ఏంటో ఓ లుక్కేద్దామా..?

సుజీత్

By

Published : Aug 30, 2019, 10:14 AM IST

Updated : Sep 28, 2019, 8:16 PM IST

సాహో.. సాహో.. సాహో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట. బాహుబలి బ్లాక్​బాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా.. హాలీవుడ్అ హుంగులు.. బాలీవుడ్ తళుకులు... ఒక్కటేమిటి.. 350కోట్ల హై ఓల్డేట్ మూవీ.. ! కాబట్టి అందరూ సాహో అనే అంటున్నారు. అయితే ప్రభాస్​తో ఇంత భారీ సినిమా తీస్తున్న ఆ దర్శకుడు ఎవరు.. ? పాతికేళ్లకు కాస్త పై వయసున్న ఈ కుర్ర దర్శకుడికి అంత పెద్ద ఆఫర్ ఎలా వచ్చింది..?

సీమ నుంచి వచ్చిన దర్శకుడు..

అప్పుడెప్పుడో దర్శక దిగ్గజం కేవి రెడ్డి అనంతపురం నుంచి వచ్చి తెలుగు సినిమాలపై తన దైన ముద్ర వేశారు. అనంతరం రాయలసీమ నుంచి చిత్రపరిశ్రమలోకి వచ్చిన దర్శకులు తక్కువే. సినీ బ్యాక్​గ్రౌండ్​ లేకుండా సినిమా అంటే పిచ్చితో అనంతపురం నుంచి హైదరాబాద్​ బయలుదేరాడు సుజీత్​. అప్పటివరకు సీఏను కెరీర్​ అనుకున్న అతడు చదువును మధ్యలోనే వదిలేశాడు.

షార్ట్​ఫిల్మ్స్​తో ఎంట్రీ..

2008 సంవత్సరం.. తెలుగులో అప్పుడప్పుడే షార్ట్​ఫిల్మ్ ట్రెండ్ మొదలైంది. నిడివి తక్కువ గల వీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తూ.. చాలామంది యువత కెమెరాలు పట్టుకొని షార్ట్​ఫిల్మ్స్​ తీయడం మొదలుపెట్టారు. వారి లాగే సినిమాలపై ఆసక్తితో సుజీత్​ లఘుచిత్రాలను​ రూపొందించడం ప్రారంభించి... దాదాపు 38 షార్ట్​ఫిల్మ్స్​ తెరకెక్కించాడు సుజీత్.

తొలి సినిమానే సూపర్​హిట్​..

సూజీత్ తీసిన లఘుచిత్రాలను చూసిన యూవీ ప్రొడక్షన్స్​ నిర్మాతలు... అతడి ప్రతిభను గుర్తించారు. దర్శకత్వం వహించే ఆఫర్​ ఇచ్చారు. అలా శర్వానంద్ హీరోగా వచ్చిన 'రన్​రాజారన్' చిత్రం సూపర్​డూపర్ హిట్టైంది. ఈ సినిమా చేసినప్పుడు సుజీత్ వయసు 22 ఏళ్లే. ఆ సినిమాలోని అతడి టేకింగ్ నచ్చిన ప్రభాస్​.. అతడితో చిత్రం చేసేందుకు అంగీకరించాడు. ఆ విధంగా 'సాహో' అవకాశం వచ్చింది.

ప్రభాస్​, శ్రద్ధాతో సుజీత్​

రెండో సినిమానే భారీ బడ్జెట్​..

చిన్న వయసులోనే సుజీత్​ తొలి విజయాన్ని అందుకోవడం ఓ ఎత్తైతే.. బాహుబలి లాంటి బ్లాక్​బాస్టర్ తర్వాత ప్రభాస్​తో పనిచేసే అవకాశం రావడం మరో ఎత్తు. అందులోనూ సుజీత్​ను నమ్మి రూ. 350 కోట్లు ఖర్చుపెట్టడం మాములు విషయం కాదు.​ ఏ మాత్రం తేడా వచ్చినా కష్టమంతా వృథా అయినట్లే. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సుజీత్ వమ్ముకానివ్వలేదు. అద్భుతమైన విజువల్స్​తో, పోరాటాలతో హాలీవుడ్​కు దీటుగా 'సాహో'ను తెరకెక్కించాడు. ట్రైలర్స్​, సాంగ్స్ చూస్తేనే ఈ విషయం అర్థమౌతుంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను సమన్వయం చేశాడు. అతి తక్కువ అనుభవంతో అంతపెద్ద సినిమాను సుజీత్ తెరకెక్కించిన విధానంచూస్తే.. "సాహో " అనాల్సిందే...ఇది చదవండి: రివ్యూ: యాక్షన్‌ థండర్​... 'సాహో' వండర్​

Last Updated : Sep 28, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details