తెలుగులో గత ఏడాది ఘనవిజయం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత సాజిద్ నడియావాలా. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారా సుతారియా ఈ సినిమాలో నటించనుంది. అహన్ శెట్టి కథానాయకుడు.
హిందీ చిత్రసీమకు 'ఆర్ఎక్స్ 100' పయనం
ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు ప్రముఖ దర్శకులు మిలాన్ లుతారియా. సాజిద్ నడియావాలా ఈ సినిమాకు నిర్మాత. అహన్ శెట్టి, తారా సుతారియా హీరోహీరోయిన్లు.
ప్రముఖ దర్శకుడు మిలాన్ లుతారియా ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్‌ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు చిత్రబృందం. ఫాక్స్ స్టార్ స్టూడియో సమర్పణలో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆర్ ఎక్స్ 100. తెలుగులోలా బాలీవుడ్‌లోనూ హీట్ ఎక్కించనుందీ చిత్రం.
మిలాన్ లుతారియా ఇంతకు ముందు దీవార్, ట్యాక్సీ నెం. 9211, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి, డర్టీ పిక్చర్ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డర్టీ పిక్చర్‌కు 3 జాతీయ పురస్కారాలు వచ్చాయి.