తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​' సింహాసనం సీజ్​ - russia govt seized iron throne

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ సిరీస్​ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. అందులో ఉన్న లోహ సింహాసనం ప్రజలను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ ఐరన్​ థ్రోన్​లు బాగా ఫేమస్​ అయ్యాయి. తాజాగా రష్యాలో ఏర్పాటు చేసిన ఐరన్​ థ్రోన్​ను అధికారులు సీజ్​ చేశారు.

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​' సింహాసనం రష్యాలో సీజ్​

By

Published : May 15, 2019, 7:12 PM IST

సినిమాల్లోని సెట్లు, హీరో హీరోయిన్లు వాడే వస్తువులు ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ సిరీస్​లో ఉపయోగించిన ఐరన్​ థ్రోన్​కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్​ వచ్చింది. అందుకే రష్యాలోని సెయింట్​ పీటర్​బర్గ్స్​ హెచ్​బీఓ మెయిన్​ స్క్వేర్​ వద్ద ప్రజలు ఫొటోలు తీసుకునేందుకు లోహ సింహాసనాన్ని ఏర్పాటు చేశారు.

రష్యా అధికారులు చేసిన తనిఖీల్లో ఆ ఇనుప సింహాసనం అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు తేలింది. వెంటనే ఆ ఐరన్​ థ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు. తొలగించిన దానిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​'లోని ఐరన్​ థ్రోన్​

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ 8వ సీజన్​ చివరి ఎపిసోడ్ మే 26న ప్రసారం కానుంది. ఈ చివరి ప్రీమియర్​తో సిరీస్​కు ముగింపు పలకనున్నారు. రష్యాలోని ఓ ప్రఖ్యాత సంస్థ చేసిన సర్వే ప్రకారం ఆ దేశంలోని ప్రతి పది మందిలో ఒకరు 'గేమ్​ ఆప్​ థ్రోన్స్'​ను వీక్షిస్తున్నారట.

ఇవీ చూడండి -->కాఫీ కప్​ మరువక ముందే చేయి కనిపించింది..!

ABOUT THE AUTHOR

...view details