తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్ఆర్' షెడ్యూల్ మారిందా...? - pune

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్​ఆర్ఆర్'. హైదరాబాద్​లో షూటింగ్ పూర్తయిన వెంటనే తదుపరి షెడ్యూల్​ను తమిళనాడులో పూర్తి చేయనున్నారని సమాచారం.

సినిమా

By

Published : Jul 28, 2019, 2:24 PM IST

మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్​లో షూటింగ్ జరుపుకొంటోంది. ఇద్దరు హీరోలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్' తదుపరి షెడ్యూల్ పుణెలో జరగాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ పుణెకు బదులు తమిళనాడులో పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. మొదటి వారం ఎన్టీఆర్, రామ్ చరణ్​ కాంబినేషన్​లో వచ్చే కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్​కు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం యంగ్ టైగర్ కసరత్తులు చేస్తున్నాడు.

ఈ సినిమాలో అజయ్ దేవగణ్, సముద్రఖని, కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 2020 జులై 30న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇవీ చూడండి.. 5 వారాల్లోనే కబీర్ సింగ్ రికార్డు వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details