అనుకోని పరిస్థితుల వల్ల వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. కొత్త రిలీజ్ తేదీ ఖరారు చేసుకుంది. డిసెంబరు 9న ఉదయం 10 గంటలకు థియేటర్లలోనే నేరుగా దీనిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుందీ సినిమా.