RRR songs: గత కొన్నిరోజుల నుంచి ప్రచారంలో తలమునకలై ఉన్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. న్యూ ఇయర్ జోష్‌ను పెంచేందుకు కొత్త పాట రిలీజ్ చేసింది. 'రామమ్ రాఘవమ్' అంటూ సాగే లిరిక్స్.. ఫ్యాన్స్‌కు ఊపు తెప్పిస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుత కలిగిస్తున్నాయి.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
Shyam singha roy Balakrishna: నందమూరి బాలకృష్ణ.. 'శ్యామ్‌సింగరాయ్' చూశారు. సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. అందుకు సంబంధించిన ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలానే ఈ సినిమాలో 'రైజ్ ఆఫ్ శ్యామ్‌సింగరాయ్' వీడియో సాంగ్.. జనవరి 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
నాని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
Major movie: అడివిశేష్ 'మేజర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ మొదలుపెట్టారు శేష్. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. సయి మంజ్రేకర్ హీరోయిన్. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.