తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR: ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ పూర్తి.. రిలీజ్​ వాయిదా! - మూవీ అప్​టేట్స్​

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్​గానే కాకుండా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'ఆర్​ఆర్​ఆర్​'. ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్​ని ఇస్తూ వస్తున్న మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్​ని అందించారు.

rrr movie updates
ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ పూర్తి.. రిలీజ్​పై క్లారిటీ!

By

Published : Aug 26, 2021, 4:00 PM IST

Updated : Aug 26, 2021, 7:26 PM IST

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' (RRR) సినిమా షూటింగ్​ పూర్తయింది. ఈ మేరకు చిత్రబృందం గురువారం ప్రకటించింది. కొన్ని చిన్న చిన్న షాట్స్​ మాత్రమే మిగిలి ఉన్నాయని.. పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్​ను ఇస్తామని పేర్కొంది. ఏ బైక్​ షాట్​తో అయితే చిత్రీకరణ ప్రారంభం అయిందో.. అదే బైక్​ షాట్​తో షూటింగ్​ పూర్తి చేశామని తెలిపింది.

మూవీ టీమ్​ ప్రకటన

త్వరలో అప్డేట్..

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాపై.. మూవీ టీమ్​ మరో క్లారిటీ కూడా ఇచ్చినట్టే చెప్పాలి. ఇన్ని రోజులు కూడా ఈ చిత్రం ప్రతి పోస్టర్, బ్యానర్ లో కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 13ని వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇందులో దానిని మిస్ చేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా పడినట్లే కనిపిస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్​ చిత్రం కొత్త రిలీజ్​ డేట్ పై రానున్న రోజుల్లో మరో ప్రకటన రానుంది అనే టాక్ ఉంది. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి.

కార్లలో రయ్​రయ్​..

'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణపై అప్​డేట్​ ఇచ్చిన కొద్ది సేపటికే చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. పులి, చిరుత సెట్​ నుంచి బయలుదేరాయని చిత్రబృందం పోస్టుకు క్యాప్షన్​ పెట్టింది. రామోజీ ఫిల్మ్​సిటీలో సినిమా లాస్ట్​షాట్​ షూటింగ్​ పూర్తి చేసుకున్న హీరోలు రామ్​చరణ్​, ఎన్టీఆర్​ సెట్​ నుంచి బయలుదేరారు. హీరోలు.. లగ్జరీ కార్లలో దూసుకెళ్తునట్టు ఉన్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి :Manchu vishnu: జగన్‌, షర్మిల నాపై కోప్పడ్డారు!

Last Updated : Aug 26, 2021, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details