'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్' వంటి చిత్రాలతో అడల్ట్ కంటెంట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి... 'భలే భలే మగాడివోయ్' సినిమాతో తనపై ఉన్న ఆ ముద్రను పూర్తిగా చెరిపేసుకున్నాడు. ఆ తర్వాత వినోదాత్మక కథలకు కేరాఫ్‌గా నిలిచాడు. ప్రస్తుతం సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌తో 'ప్రతిరోజూ పండగే' సినిమాను తెరకెక్కిస్తున్నాడీ దర్శకుడు. తొలిసారి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
మారుతికి 'ఆర్ఆర్ఆర్' నిర్మాత భారీ పారితోషకం..?
ప్రముఖ దర్శకుడు మారుతి, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డి.వి.వి దానయ్యతో మారుతికి ఓ భారీ ఒప్పందం కుదిరిందని సినీ వర్గాల సమాచారం.
తాజాగా 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డి.వి.వి దానయ్యతో మారుతి ఓ భారీ ఒప్పందం చేసుకున్నాడని సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానయ్య తన కుమారుడ్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఈ బాధ్యతను మరుతికి అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ దర్శకుడికి రూ.6 కోట్ల భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మారుతి కెరీర్‌లోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్ అని చిత్ర సీమలో టాక్. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలుపెట్టనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.