*'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' అంటూ సాగే డ్యాన్స్ సాంగ్ రావడానికి మరో మూడు రోజులే ఉంది. ఈ గీతంలో రామ్చరణ్, ఎన్టీఆర్.. అదిరిపోయే డ్యాన్సులతో అలరించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 7న థియేటర్లలోకి రానుంది.
*కింగ్ నాగార్జున 'బంగార్రాజు' నుంచి తొలి పాట వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి సాంగ్ మంగళవారం ఉదయం 9:09 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారట.