తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రికెటర్లకు 'ఊర్వశి' గాలం.. పంత్, హార్దిక్ సేఫ్​​​! - bollywood news

భారత్​లో క్రికెట్​, సినిమా స్టార్స్​కు ఉండే ఆదరణే వేరు. ఈ రెండు రంగాల్లో ఎన్నో ప్రేమ జంటలు పెళ్లిపీటలెక్కాయి. ఇటీవల యువ క్రికెటర్​ హార్దిక్​.. బాలీవుడ్​ భామ నటాషాను నిశ్చితార్థం చేసుకోగా, పంత్​ ఐదేళ్లుగా నేగీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఓ బాలీవుడ్​ భామ ప్రేమ గాలం నుంచి తప్పించుకున్నారట. పంత్​ అయితే ఏకంగా ఆమె వాట్సాప్​నూ బ్లాక్​ చేశాడని సమాచారం.

Rishabh Pant, Hardik Pandya Hide from actress Urvashi Rautela's Eye..!
క్రికెటర్లకు 'ఊర్వశి' గాలం.. పంత్, హర్దిక్ మిస్​​​!

By

Published : Jan 12, 2020, 6:45 AM IST

Updated : Jan 12, 2020, 7:14 AM IST

టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్‌ ముద్దుగుమ్మల సాన్నిహిత్యంపై ఎప్పుడూ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. రాహుల్​-అతియా వంటి కొందరు ప్రేమించుకున్నట్లు పుకార్లు వస్తుండగా.. యూవీ-హేజల్‌, కోహ్లీ-అనుష్క, జహీర్‌-సాగరిక, హర్భజన్‌-గీతా వంటివారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇలానే బాలీవుడ్​ భామ ఊర్వశి రౌతేలా.. తొలుత హార్దిక్​, తర్వాత పంత్​ను ప్రేమలో పడేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా వైరల్‌ అవుతున్న ఓ సంగతి ఏంటంటే? యువ క్రికెటర్‌ రిషబ్​ పంత్‌.. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా వాట్సప్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశాడట. వీరిద్దరూ గతంలో పార్టీలకు కలిసిన వెళ్లినట్లు, బయట కలిసి తిరిగినట్లు వార్తలు వచ్చాయి.

నేగీ ప్రేమ చాలూ!

ఇప్పటివరకు ఐదేళ్లుగా రహస్యంగా నడిపిన ప్రేమ వ్యవహారం ఇటీవల భయటపెట్టాడు పంత్​. ఉత్తరాఖండ్​కు చెందిన ఇషా నేగీ అనే అమ్మాయితే ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఈనెల 1న ఇదే విషయాన్ని చెప్పాడు. ఇన్‌స్టాలో ఇషాతో కలిసున్న ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

"నీతో కలిసున్నప్పుడు నన్ను నేను మరింత ఇష్టపడతా" అని కవితాత్మక ధోరణిలో ఓ వ్యాఖ్య పెట్టాడు. అయితే విషయం తెలియదు గానీ పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించిందట. ఆమెతో సంభాషణను ముందుకు తీసుకెళ్లేందుకు అతడు ఇష్టపడలేదట. పదేపదే విసిగిస్తుందనుకున్నాడో ఏమో ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశాడని ఇంటర్నెట్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆటతీరుపై పక్కదారి పట్టడానికి ఆమెను ఓ కారణంగా పంత్​ భావించాడని మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్‌ చేసుకున్నారని ఊరశ్వి సహాయకుడు చెప్పినట్టు తెలిసింది.

ఎవరికీ తెలియని నిశ్చితార్థం

ఊర్వశి.. 2018లో ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య​తోనూ డేటింగ్​లో ఉన్నట్లు, ఇద్దరూ కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. ఆమె నుంచి తప్పించుకొని, నటాషా ప్రేమ ద్వారా బయటపడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరికీ చెప్పకుండా నిశ్చితార్థం చేసుకున్నాడని తెలిసింది. అయితే హార్దిక్​ నిశ్చితార్థం విషయం తెలుసుకున్న ఊర్వశి.. వెంటనే ట్వీట్​ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

ఏదేమైనా బాలీవుడ్​ భామలు, టీమిండియా క్రికెటర్ల కొన్ని ప్రేమ బంధాలు ఎప్పటికీ కళా తోరణాలే!

Last Updated : Jan 12, 2020, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details