తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్, రియా పెళ్లి చేసుకోవాలనుకున్నారు! - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ వార్తలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ తన ప్రేయసి రియా చక్రవర్తిని వివాహం చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని రియా ప్రాపర్టీ ఏజెంట్ తాజాగా వెల్లడించారు.

Rhea Chakraborty Confirmed Wedding With Sushant Singh Rajput says Property Agent
సుశాంత్

By

Published : Jun 17, 2020, 9:32 AM IST

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ తన గర్ల్‌ఫ్రెండ్‌, నటి రియా చక్రవర్తిని వివాహం చేసుకోవాలి అనుకున్నారట. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఉండటానికి ఓ ఇంటిని చూడమని రియా తన ప్రాపర్టీ ఏజెంట్‌కు చెప్పారట. ఈ విషయాన్ని తాజాగా ఆ ఏజెంట్​ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"సుశాంత్‌, రియా ఓ మంచి ఇంటి కోసం వెతుకుతున్నారు. 'బాంద్రాలో ఇంటి కోసం చూస్తున్నాం. నేను సుశాంత్‌తో కలిసి ఉండబోతున్నా. త్వరలో మా వివాహం జరగబోతోంది' అని రియా నాతో చెప్పారు" అని ప్రాపర్టీ ఏజెంట్ తెలిపారు.

అనంతరం ఇంటి అద్దె చెల్లించడంలో సమస్యలు ఉన్నాయా? అని అడగగా.. "అద్దె విషయంలో ఎప్పుడూ అలాంటివి జరగలేదు. అర్ధరాత్రి పార్టీలు జరుపుకోవడం మాత్రమే చిన్న సమస్యగా ఉండేది. ఓసారి సొసైటీ వారికి ఫిర్యాదు కూడా చేశారు" అని ఏజెంట్‌ చెప్పారు.

సుశాంత్‌, రియా ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. సుశాంత్‌ పుట్టినరోజున ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా చెప్పారు. రియాను 'నా జిలేబీ' అంటూ ఓసారి సుశాంత్‌ ఫొటో షేర్‌ చేశారు. ఓసారి నటుడి పెళ్లి గురించి ఆయన కజిన్‌ను అడగగా.. వింటర్‌లో సుశాంత్‌ పెళ్లికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఫ్యామిలీ ముంబయి రాబోతోందని తెలిపారు. కానీ పెళ్లి కుమార్తె పేరు మాత్రం బయటపెట్టలేదు.

ABOUT THE AUTHOR

...view details