తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Kajol: 'కాజోల్ కళ్లు చూస్తే అలా అనిపిస్తుంది' - kajol devgan

Kajol: సీనియర్‌ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తోన్న చిత్రం 'సలామ్‌ వెంకీ'. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాజోల్​ శక్తిమంతమైన కళ్లు, నవ్వు చూస్తే ఏదైనా సాధ్యమే అనిపిస్తుందని చెప్పారు రేవతి.

kajol
revathi

By

Published : Feb 12, 2022, 9:18 AM IST

Kajol: కాజోల్‌ ప్రధాన పాత్రలో సీనియర్‌ నటి రేవతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సలామ్‌ వెంకీ'. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు కాజోల్‌. "కచ్చితంగా చెప్పాల్సిన ఓ కథ ప్రయాణం ఈ రోజు మొదలైంది" అని రాశారు.

రేవతి, కాజోల్

జీవితంలో ఓ మహిళ ఎదుర్కొన్న ఆటుపోట్ల నేపథ్యంగా వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. "ఈ కథ అనుకోగానే నా మనసులో ముందుగా మెదిలింది కాజోల్‌ ముఖమే. సున్నితంగా, శక్తిమంతంగా ఉండే ఆమె కళ్లు, అందమైన నవ్వు చూస్తే ఏదైనా సాధ్యమే అనేలా ఉంటాయి. ఈ కథకు అలాంటి లక్షణాలే అవసరం. ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది" అన్నారు రేవతి.

కాజోల్

డైనోసార్లతో కలిసి బతకడం అసాధ్యం

'జురాసిక్‌ వరల్డ్‌' చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ విజయవంతమైన ఫ్రాంచైజీ నుంచి 'జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. కొలిన్‌ ట్రెవోరో తెరకెక్కించిన చిత్రమిది. యూనివర్సల్‌ పిక్చర్స్‌, ఆంబ్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పర్ఫెక్ట్‌ వరల్డ్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. క్రిస్‌ ప్రాట్‌, బ్రైస్‌ డల్లాస్‌ హౌవర్డ్‌, లౌరా డెర్న్‌, సామ్‌ నీల్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదల చేశారు. "నేను ప్రపంచానికి కల్పితం కాని ఓ వింతను చూపించాలనుకుంటున్నాను. అది వాళ్లు నిజంలా భావించాలి. ఆ వింతని వాళ్లు చూడగలగాలి, ముట్టుకోగలగాలి" అంటూ హీరో క్రిస్‌ చెబుతున్న సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది.

ప్రచార చిత్రంలో డైనోసార్ల ప్రపంచాన్ని.. మనుషులకు వాటికి మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాల్ని ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాని దాదాపు 5బిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఇదీ చూడండి:సేతుపతి-సమంత సినిమా రిలీజ్​ డేట్​.. వరుణ్​ తేజ్​ మూవీ అప్డేట్​

ABOUT THE AUTHOR

...view details