కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో కష్టంలో ఉన్నవారికి నేనున్నానంటూ ధైర్యం నింపి సాయం చేస్తున్నారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్. దేశంలో ఏ మూలన ఎవరికి ఏ సాయం కావాలన్నా సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తే చాలు.. క్షణాల్లో పరిష్కారం చూపుతూ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వలస కూలీల నుంచి కొందరు ప్రముఖుల దాకా ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తనకు వీలైనంతగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రియల్‌హీరో భారీ కటౌట్‌కు పాలాభిషేకం - సోనూసూద్‌కు పాలాభిషేకం
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తూ రియల్ హీరోగా మారారు నటుడు సోనూసూద్. ఎవరికి ఏం కావాలన్న వీలైనంత సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తికి పాలాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు కొందరు ఫ్యాన్స్.
సోనూసూద్
అలాంటి రియల్ హీరోకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించారు. పులి శ్రీకాంత్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సోనూసూద్‌ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఇతరులకు సాయం చేయాలనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియోను సోనూసూద్ రీట్వీట్ చేస్తూ వినయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Last Updated : May 21, 2021, 8:56 AM IST