తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖిలాడి' ట్రైలర్​కు టైమ్ ఫిక్స్.. 'ఎఫ్ 3' డబ్బు సాంగ్ - raviteja new movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్ టైమ్​తో పాటు 'ఎఫ్ 3'లోని తొలి సాంగ్​ ప్రోమోకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్

By

Published : Feb 6, 2022, 1:50 PM IST

Raviteja khiladi trailer: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' ట్రైలర్​కు టైమ్​ ఫిక్సయింది. ఫిబ్రవరి 7న సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

రవితేజ ఖిలాడి ట్రైలర్

ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అర్జున్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ-హవీష్ సంయుక్తంగా నిర్మించారు.

F3 movie songs: వెంకటేశ్-వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్3'. 'ఎఫ్ 2'కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ సినిమాలోని 'లబ్ డబ్ లబ్ డబ్..' అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది. పూర్తి గీతం సోమవారం విడుదల కానుంది.

ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. దిల్​రాజు నిర్మాత.

'గని' సాంగ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details