తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిలీజ్​ డేట్​తో 'ఖిలాడి'.. 'గని' అప్డేట్​ - వరుణ్​ తేజ్​ గని సినిమా

రవితేజ నటించిన 'ఖిలాడి'(khiladi movie release date) సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. కాగా, వరుణ్​ తేజ్​ నటించిన 'గని' సినిమా టీజర్ రిలీజ్​కు​ టైమ్​ ఫిక్స్​ అయింది. ​

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Nov 11, 2021, 11:01 AM IST

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఖిలాడి'(Khiladi movie release date). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2022 ఫిబ్రవరి 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.

టీజర్​కు టైమ్ ఫిక్స్​

మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(Ghani Movie). ఈ చిత్ర టీజర్​ను నవంబరు 15న విడుదల చేస్తామని తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే సినిమాలో నటిస్తున్న వారి పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్​ చేసింది. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలోని 'గని ఆంథమ్​'(ghani Anthem)ను శనివారం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో(ghani anthem promo)ను విడుదల చేశారు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఆల్​ ది బెస్ట్

శ్రీకాంత్‌ ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం 'తెలంగాణ దేవుడు'. హరీష్‌ వడత్యా తెరకెక్కిస్తున్నారు. మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడు. బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్రం విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తూ చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్​ చెప్పారు హాస్యనటుడు బ్రహ్మానందం. దీనికి సంబంధించిన వీడియోను సినీ జర్నలిస్ట్​ బీఏ రాజు సోషల్​మీడియా టీమ్​ ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి: 'నాటు నాటు' పాట​లో క్యూట్ క్యూట్​ చిన్నది!

ABOUT THE AUTHOR

...view details