రష్మిక మందణ్న.. చలో, గీత గోవిందం లాంటి హిట్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ హీరో రక్షిత శెట్టితో ప్రేమ వ్యవహారం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రష్మిక. కొన్ని బంధాలను ముందుకు తీసుకెళ్లలేకపోతే.. వదిలేయడమే మంచిదని చెప్పిందిఈ కన్నడ భామ.
"అమ్మనాన్నలకు నాపైన భరోసా ఎక్కువ. నా అభిప్రాయానికి ఎంతో విలువనిస్తారు. అమ్మ దగ్గర అన్నీ చెప్పుకుంటా. అందరకీ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. నాకెందుకు లేరని అమ్మని చాలా సార్లు అడిగా. కిరిక్ పార్టీ సమయంలో హీరో రక్షిత్ శెట్టి అంటే అభిమానం ఏర్పడింది. అనంతరం అది ఇష్టంగా, ప్రేమగా మారింది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమేనా అని అమ్మను అడిగా. నీ ఇష్టం.. నీకు ఏది అనిపిస్తే అది చేయ్ అని చెప్పి.. నా అభిప్రాయానికి విలువనిచ్చింది" -రష్మిక మందణ్న, హీరోయిన్.