బాడీ డబుల్.. అచ్చం ఒకరిని పోలినట్లు మరొకరు ఉంటారు. అయితే వాళ్లేమీ ఒకే తల్లి కడుపున పుట్టరు. రక్త సంబంధీకులు కాదు. ఇలాంటి పాత్రలు ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజ జీవితంలోనూ కొంత మంది సెలబ్రిటీలను పోలినవాళ్లు నెట్టింట బాగా ఫేమ్ పొందారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు జిరాక్స్‌గా ఉండే మోడల్ జునైద్ షా ఒకడు. శుక్రవారం ఆకస్మికంగా గుండెనొప్పి రావడం వల్ల మరణించినట్లు తన కుటుంబసభ్యులు వెల్లడించారు.
హీరో రణ్‌బీర్‌ను పోలిన యువ మోడల్ మృతి - ممبئی میں ماڈلنگ کا کام
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పోలినట్లు ఉంటే మోడల్ జునైద్ షా శుక్రవారం కన్నుమూశాడు. కశ్మీర్‌లోని తన నివాసం వద్ద గుండెపోటుతో మరణించినట్లు షా కుటుంబసభ్యులు తెలిపారు.
హీరో రణ్‌బీర్‌ను పోలిన యువ మోడల్ మృతి..
యుక్త వయసులో ఉన్న ఈ మోడల్ మరణంతో కశ్మీర్ శ్రీనగర్‌లోని ఎల్లహీ బాగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం అచ్చు రణ్‌బీర్ కపూర్‌లా ఉండే జునైద్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిని చూసిన రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.