తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bheemla Nayak: రానాకు 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్​.. వీడియో అదుర్స్​! - భీమ్లా నాయక్‌

Bheemla Nayak: నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసింది 'భీమ్లా నాయక్' చిత్రబృందం. 'వాడు అరిస్తే భయపడతావా?' అంటూ రానా చెప్పే డైలాగ్ ఈలలు కొట్టించేలా ఉంది.

bheemla nayak
rana daggubati

By

Published : Dec 14, 2021, 6:11 PM IST

Bheemla Nayak: సినీ అభిమానులకు 'భీమ్లా నాయక్‌' నుంచి మరో సర్‌ప్రైజ్‌ అందింది. రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్‌ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. 'వాడు అరిస్తే భయపడతావా? నేను వాడికన్నా గట్టిగా అరవగలను. అయినా ఎవడు వాడు? పైనుంచి దిగొచ్చాడా?' అంటూ రానా చెప్పిన డైలాగ్ విశేషంగా అలరిస్తోంది. మధ్యలో పవన్‌ కల్యాణ్‌ దర్శనం ఆ జోష్‌ను మరింత పెంచేలా ఉంది.

సూపర్ హిట్‌ మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్‌' తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా డేనియల్‌ శేఖర్‌గా రానా కనిపించనున్నారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదల కానుంది.

ఇదీ చూడండి:'విరాట పర్వం' స్పెషల్​ వీడియో.. 'బంగార్రాజు', 'ఖిలాడి' అప్డేట్స్​

ABOUT THE AUTHOR

...view details