తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దూరం తరుగుతుంటే.. గారం పెరుగుతుంటే... - kajal

'రణరంగం' సినిమాలో 'సీతా కల్యాణ వైభోగమే..' లిరికల్ పాట విడుదలైంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ సాంగ్​ను శ్రీహరి ఆలపించాడు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

రణరంగం

By

Published : Jul 4, 2019, 6:03 PM IST

శర్వానంద్ నటిస్తోన్న కొత్తచిత్రం 'రణరంగం'. తాజాగా ఈ సినిమాలో లిరికల్ పాట విడుదలైంది. 'సీతా కల్యాణ వైభోగమే..' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 2న చిత్రం విడుదలకానుంది.

తెలుగు సినిమాల్లో పెళ్లి పాటలు చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. అదేరీతిలో.. "దూరం తరుగుతుంటే.. గారం పెరుగుతుంటే".. అంటూ సాగే ఈ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీహరి ఆలపించాడు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చాడు.

సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటైర్​టైన్​మెంట్స్​ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: సోషల్ మీడియాలో యువతకు కొత్త ఛాలెంజ్!

ABOUT THE AUTHOR

...view details